![]() |
![]() |
.webp)
"నీతోనే డాన్స్" షో ఇప్పుడిప్పుడే మంచి రసవత్తరంగా సాగుతోంది. జోడీస్ అంతా నెమ్మదిగా సెట్ అవుతున్నారు. మొత్తం 8 జంటలతో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇకనుంచి మార్క్స్ తో యుద్ధం మొదలుకాబోతోంది అన్న విషయం కూడా రీసెంట్ ప్రోమో ద్వారా అర్ధమయ్యింది. అలాంటి టైంలో ఈ షో నుంచి ఒక జోడి వికెట్ డౌన్ ఐపోతుందనే వార్త వినిపిస్తోంది. ఆ జోడి అంజలి-పవన్. రీసెంట్ షో ప్రోమో చూస్తే చాలు ఆ విషయం మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇద్దరూ డాన్స్ చేస్తూ మధ్యలో సడెన్ గా ఆగిపోయారు. ఇంతకు ఏమయ్యింది అని ఆడియన్స్ టెన్షన్ పడ్డారు. చివరికి పవన్ కాలికి ఫ్రాక్చర్ అవడంతో డాక్టర్ డాన్స్ ఇంకా చేయొద్దు అని చెప్పారని చెప్పింది అంజలి. 'పుష్ప' మూవీలోని 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి' పాటను పవన్- అంజలి జోడి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. కథాకళి , కాంతార గెటప్స్ ని మిక్స్ చేసి ఒక వెరైటీ లుక్ తో ఈ సాంగ్ ని ప్రాక్టీస్ చేశారు. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నంత సేపు జడ్జీలు కూడా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు. కానీ డ్యాన్స్ మధ్యలో సడెన్‌గా పవన్ ఆగిపోవడంతో అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత తరుణ్ మాస్టర్, రాధిక, సదా స్టేజి మీదకు వచ్చి వాళ్లిద్దరినీ ఆత్మీయంగా హగ్ చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. పవన్ అంజలి ఇద్దరూ గట్టిగా ఏడ్చేశారు.
తర్వాత వీళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్లడం అక్కడ టెస్టులన్నీ జరిగాక ఆ రిపోర్ట్స్ ని ఆడియన్స్ కి చూపిస్తూ ఒక వీడియో కూడా చేశారు. ఇక ఆ వీడియోలో "అందరికీ చాలా థ్యాంక్స్...మాకు ఏమయ్యిందంటూ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న డాన్స్ ప్రాక్టీస్ హెవీ అయ్యేసరికి మా ఇద్దరికీ కాళ్లల్లో ఇంజూరి అయ్యిందని చెప్పారు.. పవన్‌కి ఎమ్ఆర్ఐ చేస్తే ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్పారు.. డాన్స్ చేయకుండా రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. చాలా రోజుల తర్వాత మంచి డ్యాన్స్ షోతో మీ ముందుకొచ్చాం అని చాలా సంతోషంగా ఫీలయ్యాం.. మేము ఉన్నంత వరకు బాగా చేయాలి అనుకున్నాం.. కానీ కుదరడం లేదు. సంకేత్‌కి చెప్పాలి.. మంచి కొరియోగ్రాఫర్ తను.. షో వాళ్లకి కూడా చెప్పాలి." అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యింది అంజలి. ఇలా ఈ షో నుంచి ఒక జోడి దూరం అవుతుండడంతో అందరూ ఫీలవుతున్నారు.
![]() |
![]() |